/rtv/media/media_files/2025/06/13/qTiKiIEW30bzoiqwhk3L.jpg)
Telangana government employees.
Telangana government : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. దేవాదాయ శాఖ పరిధిలో పని చేస్తున్న అర్చకులతోపాటు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్చక, ఉద్యోగులకు ఉన్న గ్రాట్యూటీ రూ 4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అర్చకులకు మరికొన్ని కానుకలను అందించింది. డీడీఎన్‌ఎస్ అర్చకుల విద్య, వైద్యం, వివాహ గ్రాంట్, ఉపనయన గ్రాంట్, దహన ఖర్చులు, గ్రాట్యూటీ, అంగవైకల్యానికి ఆర్థిక సహాయం వంటి పథకాలను అర్చక సంక్షేమ నిధి ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Follow Us