BIG BREAKING: ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు

జూన్ చివరిలోగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని ఆయన అన్నారు. మొదట MPTC, ZPTC ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు.

New Update
Telangana Minister Ponguleti Srinivas Reddy

Telangana Minister Ponguleti Srinivas Reddy

జూన్ నెలాఖరులోగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం(రేపు) జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించాక సర్పంచ్ ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని అన్నారు.  మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మున్సిపల్, సర్పంచ్ ఎలక్షన్ నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని మంత్రి సూచించారు.

నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల రావడానికి  మరో15రోజుల గడువు మాత్రమే ఉందని.. మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రి చెప్పారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని అన్నారు. 

Advertisment
తాజా కథనాలు