BRS పార్టీకి బిగ్ షాక్.. మెదక్‌‌లో హరీశ్ కిడ్నాప్‌యత్నం!

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం 44వ హైవేపై బీఆర్ఎస్ లీడర్ కిడ్నాప్‌ కలకలం చోటుచేసుకుంది. నిర్మల్‌ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత హరీశ్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. తర్వాత ఆయన దుండగుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.

New Update
BRS (1)

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం 44వ జాతీయ రహదారి టోల్‌గేట్‌ వద్ద ఆదివారం ఉదయం కిడ్నాప్‌ కలకలం చోటుచేసుకుంది. నిర్మల్‌ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత హరీశ్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అతడి ఇన్నోవా వాహనంలోనే అపహరించి హైదరాబాద్‌ వైపు తీసుకెళ్లారు.

ఈక్రమంలో మెదక్‌ జిల్లా తూప్రాన్‌ టోల్‌గేట్ వద్ద వాహనం వేగం తగ్గడంతో కిడ్నాపర్ల నుంచి హరీశ్‌ తప్పించుకుని తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హరీశ్‌ చాకచక్యంగా తప్పించుకుని పోలీస్‌ స్టేషన్‌కు చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై నిర్మల్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు