TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తాగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని హెచ్చరించిన తండ్రి కనకయ్యను కొట్టి చంపేశాడు కొడుకు పరశురాములు. కర్రతో మెడపై దాడి చేయగా కనకయ్య అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.