TG Crime : ఏం మనుషులురా మీరు....మాన‌సిక విక‌లాంగురాలిపై తండ్రీకొడుకు అత్యాచారం

హైద‌రాబాద్ శివారులో మానవత్వం మరిచిపోయిన ఓ తండ్రి, కుమారుడు కలిసి దారుణానికి ఒడిగట్టారు. మానసిక స్థితి సరిగా లేని వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడా అమాయకురాలు గర్భం దాల్చింది. దీంతో విషయం తెలిసి స్థానికులు వారిని ఛీ కొడుతున్నారు.

New Update
rape

Father and son rape mentally disabled woman

TG Crime : ఆడవారిని చూడగానే మగాడు మృగాడు అవుతున్నాడు. వావివరుసలు, వయసు తేడాలు, మానవత్వం ఏవీ గుర్తుకు రావడం లేదు. దీంతో పశువాంఛతో తాము ఏం చేస్తున్నామనే విచక్షణను మరిచిపోతున్నాడు. దీంతో మనుషులపై మనుషులకే నమ్మకం లేకుండా పోతుంది. 

Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్‌..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?

హైద‌రాబాద్ శివారులో మానవత్వం మరిచిపోయిన ఓ తండ్రి, కుమారుడు కలిసి దారుణానికి ఒడిగట్టారు. మానసిక స్థితి సరిగా లేని వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడా అమాయకురాలు గర్భం దాల్చింది. దీంతో విషయం తెలిసి స్థానికులు వారిని ఛీ కొడుతున్నారు.

Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నగర శివారులో 23 ఏండ్ల వ‌య‌సున్న ఓ యువ‌తి(మాన‌సిక విక‌లాంగురాలు) త‌న త‌ల్లితో క‌లిసి ఉంటుంది. ఆమెకు తండ్రి లేకపోవడం, ఆమె మానసిక వికలాంగురాలు కావడంతో వారికి మగ దిక్కులేదు. యువ‌తి త‌ల్లి కూలీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తుండగా, యువతి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ త‌ల్లి ఇంట్లో లేని స‌మ‌యంలో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి, అతని కుమారుడు(మైనర్‌) కలిసి మాన‌సిక విక‌లాంగురాలిపై పలుమార్లు అత్యాచారం చేశారు. గ‌త కొద్ది నెల‌లుగా అమాయకురాలి జీవితంతో ఆడుకుంటున్నారు.  

Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

ఇదిలా ఉండగా ఇటీవ‌లే బాధిత యువ‌తి అస్వస్థకు గురైంది. దీంతో ఆమెను తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు టెస్టులు చేయగా, దారుణ విషయం వెలుగు చూసింది. ఆమె నాలుగు నెల‌ల గ‌ర్భిణి అని తేలింది. దీంతో తల్లి ఆమెను విషయం అడగగా జ‌రిగిన ఘోరాన్ని త‌ల్లికి చెప్పి యువ‌తి బోరున విల‌పించింది. బాధితురాలి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Also Read :  BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే

Advertisment
తాజా కథనాలు