Sachin Son: సైలెంట్ గా సచిన్ టెండూల్కర్ కొడుకు నిశ్చితార్థం..ముంబైకు చెందిన వ్యాపార వేత్త మనువరాలితో..

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చాలా సైలెంట్ గా ఇరు కుటుంబాల మధ్యలో జరిగిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని ప్రముఖ వ్యాపార వేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ తో అర్జున్ పెళ్ళి నిశ్చయం అయింది. 

New Update
arjun

Sachin son Arjun Tendulkar

సచిన్ టెండూల్కర్ పుత్రరత్నం అర్జున్ టెండూల్కర్. తండ్రి వారసత్వాన్ని అయితే తీసుకున్నాడు కానీ అందుకు తగ్గట్టు రాణించలేకపోయాడు. అర్జున్ టెండూల్కర్ బౌలర్. అయితే ఇతను తన కెరీర్ లో పెద్దగా రాణించలేదు. ఇప్పటి వరకు భారత జట్టుకు కూడా ఆడలేదు. ఐపీఎల్ లో ముంబై తరుఫున ఆడుతున్న అర్జున్.. అందులో కూడా అన్ని మ్యాచ్ లనూ ఆడడు. సెలెక్టర్లు, ముంబై జట్టు యజమాని నీతా అంబానీకి సచిన్ బాగా క్లోజ్ కాబట్టి ఆ టీమ్ లో కొనసాగుతున్నాడు. అంత కంటే అర్జున్ గురించి పెద్దగా చెప్పుకోవలసింది ఏమీ ఉండదు. సచిన్ కొడుకు కాబట్టి ఎప్పుడూ వార్తల్లో అయితే మాత్రం నిలుస్తుంటాడు. తాజాగా మరోసారి అర్జున్ టెండూల్కర్ గురించి చెప్పుకుంటున్నారు. దీని కారణం అతని పెళ్ళి. 

కామ్ గా నిశ్చితార్థం..

అర్జున్ టెండూల్కర్ పెళ్ళి నిశ్చయం అయింది. తాజాగా అతని నిశ్చితార్థం కూడా జరిగిందని తెలుస్తోంది. ముంబైకు చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ తో అర్జున్ పెళ్ళి జరుగనుంది. రెండు కుటుంబాల మధ్యలో వీరి ఎంగేజ్ మెంట్ చాలా సైలెంట్ గా జరిగిపోయిందని సమాచారం. ఘాయ్ కుటుంబం ముంబైలో చాలా పేరున్న వ్యాపార కుటుంబం. వీరికి ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్ తో పాటూ  బ్రూక్లిన్ క్రీమరీ  ఐస్ క్రీమ్(తక్కువ కేలరీల ఐస్ క్రీం బ్రాండ్) వ్యాపారం కూడా ఉంది. 

అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్, 18 లిస్ట్-ఎ మరియు 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో, ఇతను 33.51 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. 23.13 సగటుతో మొత్తం 532 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో, అర్జున్ 25 వికెట్లు (సగటున 31.2) మరియు 102 పరుగులు (సగటున 17) మాత్రమే అర్జున్ పేరు మీద ఉన్నాయి.  ఇక టీ20ల విషయానికి వస్తే.. అర్జున్ టెండూల్కర్ 25.07 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు.  13.22 సగటుతో 119 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముంబై జట్టు ఇతనిని 30 లక్షల బేస్ ధరతో కొనుగోలు చేసింది. కానీ లాస్ట్ సీజన్ మొత్తం ఇతను బెంచ్ కే పరిమితం అయ్యాడు.  

Advertisment
తాజా కథనాలు