Cricket: ఇండియా Vs ఇంగ్లండ్ సిరీస్.. మాజీ స్టార్ క్రికెటర్ కొడుకు ఎంట్రీ!

జూన్‌ 24 నుంచి జూలై 23 వరకు భారత్-ఇంగ్లాండ్ Aజట్ల మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ ఇప్పటివరకు 5 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడగా ఒక సెంచరీ చేశాడు.

New Update
flintoff

Andrew Flintoff son Rocky Flintoff selected for against India series

Ind vs Eng: జూన్‌ 24 నుంచి- జూలై 23 వరకు భారత్-ఇంగ్లాండ్ A జట్ల మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ ఇప్పటివరకు 5 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌పై సెంచరీ చేయడంతో అతనికి సెలక్టెర్లు అవకాశం ఇచ్చారు.

క్రిస్‌ వోక్స్ రీ ఎంట్రీ..

అలాగే భారత్‌ ‘ఎ’తో జరిగే 4 రోజుల మ్యాచ్‌లో ఫాస్ట్‌బౌలర్‌ క్రిస్‌ వోక్స్, లెగ్‌స్పిన్నర్‌ రేహాన్‌ అహ్మద్‌ ఇంగ్లాండ్‌ లయన్స్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక ఇరుజట్ల మధ్యం తొలి మ్యాచ్‌ మే 30న, రెండో మ్యాచ్‌ జూన్‌ 6న జరగనున్నాయి. మరోవైపు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే అండర్‌-19 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్‌ 24- జూలై 23 వరకు 5 వన్డే, 2 మల్టీ- డే మ్యాచ్‌లు ఆడేందుకు 16మందితో కూడిన జట్టును సెలెక్ట్ చేశారు. వైభవ్‌ సూర్యవంశీకి ఇందులో చోటు దక్కగా ఆయుశ్‌ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. 

Also Read: RGV: మరో వివాదంలో RGV.. కియారా బికినీ లుక్ పై వల్గర్ పోస్ట్! తిట్టిపోస్తున్న నెటిజన్లు

-జూన్‌ 24-న లోబోరో యూనివర్సిటీలో వన్డే వార్మప్‌ మ్యాచ్- 
-జూన్‌ 27- తొలి వన్డే- హోవ్‌
-జూన్‌ 30- రెండో వన్డే- నార్తాంప్టన్‌
-జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్‌
-జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్‌
-జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్‌
-జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్‌- బెకింగ్‌హామ్‌
-జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్‌- చెమ్స్‌ఫోర్డ్‌.

భారత జట్టు
ఆయుష్ మాత్రే (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్‌ కెప్టెన్, వికెట్‌ కీపర్‌), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్,  హర్‌వన్ష్‌ సింగ్ (వికెట్‌ కీపర్‌), మొహ్మద్‌ ఇనాన్‌, ఆదిత్య రానా, అన్మోల్‌జీత్‌ సింగ్‌, ఆర్‌.ఎస్‌. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్‌ గుహ, ప్రణవ్‌ రాఘవేంద్ర. 

england | india | andrew-flintoff | son | today telugu news 

Advertisment
తాజా కథనాలు