Jagga Reddy : గొప్ప మనసు చాటుకున్న జగ్గారెడ్డి.. క్యాన్సర్ పేషంట్‌కు రూ.10 లక్షలు!
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న మహిళకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది.