BIG BREAKING : సాయంత్రం లోపు చంపేస్తాం.. ఎంపీ రఘునంధన్ రావుకు మావోయిస్టుల కాల్
బీజేపీ లీడర్, మెదక్ ఎంపీ రఘునంధన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రం లోగా చంపేస్తామంటూ రఘునంధన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టులు కాల్ చేసి మరీ బెదిరించారు.
బీజేపీ లీడర్, మెదక్ ఎంపీ రఘునంధన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రం లోగా చంపేస్తామంటూ రఘునంధన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టులు కాల్ చేసి మరీ బెదిరించారు.
మెదక్ జిల్లా అంసానిపల్లిలో పెళ్ళైన 14 రోజులకే నవవరుడు సాయి కిరణ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయాన్నే లేచి స్నానం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాయికిరణ్ కి గతనెల 21న అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసిపనిచేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. అవసరమైతే మోదీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, కేంద్రంపై అలిగితే రాష్ట్రాలకే నష్టమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు.
అమీన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న మహిళకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది.
మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో స్పాట్లోనే ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
రజిత స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. మంచిగా సాగుతోన్న ఈ సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. పచ్చటి సంసారంలో నిప్పులు పోసి తగ్గలబెట్టేసింది. ఇటీవల జరిగిన పదో తరగతి గెట్ టు గెదర్ పార్టీలో పాత స్నేహితుడు ఆమెకు పరిచయం అయ్యాడు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందులో తల్లే హంతుకురాలని పోలీసులు తేల్చారు. ప్రియుడితో అక్రమ సంబంధం కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది వివాహిత.
సంగారెడ్డి జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్సై నాగలక్ష్మిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎస్సైకి తీవ్రగాయాలు కాగా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పఠాన్‌చెరులో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.