/rtv/media/media_files/2025/09/24/attempted-murder-on-husband-2025-09-24-11-08-37.jpg)
Attempted murder on husband
Crime News : క్షణికమైన సుఖం కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తలను అర్థంతరంగా సాగనంపడానికి భార్యలు ఏ మాత్రం సందేహించడం లేదు. పెళ్లికి ముందు ప్రేమాయణాలు, పెళ్లికి తర్వాత అక్రమసంబంధాల నేపథ్యంలో కట్టుకున్నోన్ని కాటికి పంపడానికే సిద్ధపడుతున్నారు. దేశవ్యాప్తంగా భర్తలను హత్య చేయించిన భార్యల ఉదంతాలు సంచలనం రేపుతుండగా అలాంటి మరోఘటన హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడగా తనను చంపించడానికి ప్రోత్సహించింది తన భార్యనే అని తెలిసి అవాక్కవడం ఆ భర్త వంతయింది.
Also Read: కోల్‌కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయిపల్లి గ్రామానికి చెందిన దేశబోయిన భూపాల్ అనే యువకుడితో కామారెడ్డికి చెందిన చంద్రకళ(23)కు ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది. ప్రస్తుతం వీరిద్దరూ కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లో కాపురం ఉంటున్నారు. భూపాల్ ప్లంబర్‌గా పనిచేస్తుండగా.. చంద్రకళ ఇళ్లల్లో పని చేస్తుంది. అయితే చంద్రకళకు పెళ్లికి ముందే ఆమె సొంత గ్రామానికి చెందిన దుర్గయ్య(26) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తరచూ ఇద్దరు కలుసుకునేవారు. దీనికోసం బ్యాచిలర్ అయిన దుర్గయ్యను వారింటికి పక్క వీధిలోని అద్దె ఇంట్లో ఉంచింది. అయితే దుర్గయ్యతో చంద్రకళకు ఉన్న సంబంధం గురించి భూపాల్ కు తెలిసింది. ఈ విషయమై భూపాల్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె దుర్గయ్యను వదులుకునేందుకు సిద్ధంగా లేదు.ఈ విషయంలో అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Also Read: తెలంగాణలో 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలు రద్దు !
ఈ క్రమంలో భూపాల్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్న చంద్రకళ ప్లాన్ ప్రకారం మంగళవారం ఉదయం ఇళ్లల్లో పనిచేయడానికి వెళ్లగా.. భూపాల్ ఇంట్లో ఒకడే ఉన్నాడు. ముఖానికి మాస్కులు ధరించిన దుర్గయ్య, అతని స్నేహితుడు భరత్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న భూపాల్‌ను కిందపడేసి ఇష్టం వచ్చినట్లు కొట్టడంతోపాటు మర్మాంగంపై తన్నారు. అతని మెడను కాళ్లతో తొక్కి చంపేందుకు ఆ ఇద్దరు ప్రయత్నించారు. వారి దెబ్బలకు బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే భూపాల్‌కు తన భార్యపై అనుమానం రావడంతో అదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు తనపై దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చంద్రకళతో పాటు మిగతా ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూకట్ పల్లి ఎస్ ఐ చంద్రశేఖర్ తెలిపారు.