ఇంటి ఓనర్‌తో అక్రమ సంబంధం.. కొడుకు ముందే తల్లి దారుణం

ఎనిమిదేళ్ల బాలుడి హృదయం తల్లి చావుని కళ్లారా చూసి కకావికళమైంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

New Update
Mother brutally murdered

కన్న కొడుకు ముందే తల్లి గొంతు కోసి దారుణ హత్య జరిగింది. ఎనిమిదేళ్ల బాలుడి హృదయం తల్లి చావుని కళ్లారా చూసి కకావికళమైంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన స్వాతి(28)కి రమేశ్‌తో 2015లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. సంవత్సరన్నర నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్దలు ఏర్పడ్డాయి. రమేశ్‌ తన పెద్ద కుమారుడితో వేరుగా ఉంటుండగా స్వాతి తన చిన్న కొడుకు(8)తో కలిసి బహదూర్‌పల్లిలోని గ్రీన్‌ హిల్స్‌ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. 

కాగా స్వాతికి ఇంటి యజమాని అయిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బోయ కిషన్‌తో వివాహేతర సంబంధం ఉంది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న కిషన్‌ని ఆమె రెండవ వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది.  దీంతో కిషన్‌ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. స్వాతి కారణంగానే గొడవలు జరగడడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించి హత్యకు పథకం రచించాడు కిషన్‌. ఇందులో భాగంగా బౌరంపేటలోని కేఎల్‌ యూనివర్సిటీ వద్ద ఫుడ్‌ కోర్ట్‌ నిర్వహిస్తున్న తన అల్లుడు రాజేష్‌, తన రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంలో పని చేసే వంశీతో మర్డర్‌కు ప్లాన్ వేశాడు.  

శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో రాజేష్‌, వంశీలు గ్రీన్‌ హిల్స్‌ కాలనీలోని స్వాతి ఇంటికి వచ్చి ఆమెను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తన కుమారుడి కళ్ల ముందే తల్లిని అతి కిరాతకంగా హత్య మార్చారు. విషయం తెలుసుకున్న దుండిగల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్య చేసిన నిందితులు నేరుగా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు