Telangana: ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో సర్పంచి పదవి

మెదక్ మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు.

New Update
Telangana local body election polling tie in in medak district

Telangana local body election polling tie in in medak district

TG Local Body Election Polling 2025

మెదక్(medak) మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు. ఈ గ్రామంలో 377 ఓట్లు ఉండగా.. 367 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీత, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీమిలి.. ఈ ఇద్దరికి 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. ఇందులో రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒకటి నోటాకు పడింది. దీంతో ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి కేతావత్ సునీత విజయం సాధించింది.  - Local Body Elections 2025

Also Read :  ఓటేయడానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..

Also Read :  తల్లిదండ్రులకు అలర్ట్: ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో కార్యక్రమం..

Advertisment
తాజా కథనాలు