/rtv/media/media_files/2025/07/17/minister-vivek-2025-07-17-21-38-37.jpg)
రాష్ట్ర కార్మిక మరియు గనులు శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఇందిరమ్మ ఇల్లు రాలేదనే కోపంలో ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. గురువారం మెదక్‌లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు.
మంత్రి వివేక్ వెంకట్ స్వామి పై మొక్కజొన్న బుట్ట విసిరిన వ్యక్తి.. అతన్ని చితక బాదిన కాంగ్రెస్ నాయకులు
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2025
మెదక్ కాంగ్రెస్ బహిరంగ సభలో వాహనంపై ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ మాట్లాడుతున్న క్రమంలో మొక్కజొన్న బుట్ట విసిరిన వ్యక్తి
దీంతో అతన్ని చితక బాదిన కాంగ్రెస్ నాయకులు
వెంటనే స్పందించిన… pic.twitter.com/8tO26aL2Ft
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తుండగా.. తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి, మంత్రి వివేక్ పై మక్క బుట్ట విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ వ్యక్తిని సభ నుంచి బయటికి తరలించి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని మందలించి వదిలేసినట్టు సమాచారం. కాగా అర్హులకు తప్పకుండా ఇళ్ళు అందిస్తామని, ఈ విడతలో రాకపోతే తరువాతి విడతలో అయినా తప్పక అందిస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.
gaddam vivek venkataswamy | minister | medak | attack | latest-telugu-news
Follow Us