BIG BREAKING : TVK సభలో తొక్కిసలాట.. 400 మందికి అస్వస్థత!
తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట జరిగింది. మధురైలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట జరిగింది. మధురైలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
తమిళగ వెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకులు విజయ్‌ని ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని గతంలోనే స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు.
జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అలాగే డీలిమిటేషన్‌పై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాష విధానం, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాలకు ఆమోదం తెలిపింది.
పెరియార్‌పై విమర్శలు చేసిన నిర్మలాసీతారామన్‌కు TVK అధ్యక్షుడు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిర్మలమ్మ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భాష విషయంలో నిజంగా బాధపడి ఉంటే త్రిభాషా సూత్రాన్ని రుద్దడం ఆపేస్తారా? అని ప్రశ్నించారు.
ధోనీ చెన్నై టీమ్‌ను గెలిపించినట్లు తాను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. విజయ్ పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు.
యాక్టర్ విజయ్ దళపతి కొత్త పార్టీ తమిఝగ వెట్రి కజగం ఈరోడ్ తూర్పు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికను బహిష్కరించింది. ఉప ఎన్నికలో గెలవడానికి సీఎం ఎంకే స్టాలిన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ ఆరోపించాడు.