TVK Party Vijay: మొదటిసారిగా బాధిత కుటుంబాలతో విజయ్ సీక్రెట్ మీటింగ్.. ప్రైవేట్ రిసార్ట్‌లో 50 రూమ్స్ బుక్

తమిళనాడు కరూర్‌ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగతంగా కలవనున్నారు. కరూర్ పర్యటనకు అనుమతి లభించకపోవడంతో, బాధితుల కుటుంబాలను చెన్నై సమీపంలోని మామళ్ళపురంలో ఉన్న ఓ రిసార్ట్‌కు రప్పించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

New Update
tvk vijay

tvk vijay

తమిళనాడులోని కరూర్‌ తొక్కిసలాట ఘటనలో మరణించిన బాధితుల కుటుంబాలను నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్(tvk vijay) వ్యక్తిగతంగా కలవనున్నారు. కరూర్ పర్యటనకు అనుమతి లభించకపోవడంతో, బాధితుల కుటుంబాలను చెన్నై సమీపంలోని మామళ్ళపురంలో ఉన్న ఓ రిసార్ట్‌కు రప్పించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తొక్కిసలాట జరిగిన నెల రోజుల తరువాత విజయ్ అక్టోబర్ 27న బాధిత కుటుంబాలను కలుస్తున్నారు. విజయ్ పార్టీ తమిళగ వెట్టి కజగం ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. 50 గదులు బుక్ చేశారు. విజయ్ ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి తన సంతాపాన్ని తెలపనున్నారు. బాధిత కుటుంబాలు కరూర్ నుంచి మహాబలిపురం చేరుకోవడానికి బస్సులు ఏర్పాటు చేసింది. అయితే.. సమావేశంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Also Read :  మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్‌.. లొంగిపోయిన 71 మంది మావోలు

Vijay Karur To Meet Families Of Stampede Victims

Also Read :  మెట్రో స్టేషన్‌లో కండోమ్‌ ప్యాకెట్లు.. షాకైపోయిన ప్రయాణికులు

సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన రాజకీయ ప్రచార ర్యాలీలో భారీగా జనం గుమిగూడారు. ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చిన్నారులు సహా 41 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విషాదం వ్యక్తమైంది. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి టీవీకే తరఫున రూ. 20 లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా, కరూర్ వెళ్లేందుకు అనుమతి లభించని కారణంగా, ఆయన బాధితుల కుటుంబాలతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడి ఓదార్చారు. త్వరలో వ్యక్తిగతంగా కలుస్తానని అప్పుడే వారికి హామీ ఇచ్చారు. కాగా, విజయ్ తమను కరూర్ వచ్చి కలవకుండా, చెన్నైకి రప్పించడంపై కొందరు బాధితుల కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమ నేత కలుసుకోవాల్సిన బాధ్యతగా కాకుండా, ప్రైవేట్ ఈవెంట్‌గా భావించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, పార్టీ కార్యకర్తలు తమకు అండగా ఉంటామని చెప్పడంతో చాలా కుటుంబాలు ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.

Advertisment
తాజా కథనాలు