BIG BREAKING: హీరో విజయ్ దళపతిపై కేసు నమోదు

ప్రముఖ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్‌ దళపతిపై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో విజయ్ అభిమాని ఆయన్ని కలిసేందుకు దగ్గరకి వెళ్లాడు. ఈక్రమంలో విజయ్ బౌన్సర్లు శరత్‌కుమార్‌ అనే వ్యక్తిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.

New Update
Vijay Thalapathy

Vijay Thalapathy

ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్‌ దళపతిపై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో విజయ్ అభిమాని ఆయన్ని కలిసేందుకు వేదిక మీదకి వెళ్లాడు. ఈక్రమంలో విజయ్ బౌన్సర్లు శరత్‌కుమార్‌ అనే వ్యక్తిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. అభిమానంతో విజయ్‌ను కలిసేందుకు వెళ్తుండగా బౌన్సర్లు అడ్డుకొని తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్‌, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. విజయ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించిన అభిమానికి స్టేజ్ పైనుంచి కిందకి తోసేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితుడు శరత్ కుమార్, ఆయన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విజయ్‌తో పాటు ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆ వీడియోలో విజయ్ బౌన్సర్లతో అలా చేయోద్దని చెప్పడం కూడా ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది. హీరో విజయ్ దళపతి తమిళనాడులో తమిళగ వెట్రి కళగం అనే కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పాల్గొననుంది. పార్టీ బలోపేతం కోసం విజయ్ రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన్ని చూసేందుకు మీటింగ్‌లకు విపరీతంగా ఫ్యాన్స్ తరలి వస్తున్నారు.

గతంలో నమోదైన కేసులు:

'లియో' సినిమాపై కేసు: 'లియో' సినిమాలోని "నా రెడీ" పాటలో విజయ్ ధూమపానం చేస్తూ కనిపించినందుకు ఒక వ్యక్తి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొగకు ఉత్పత్తులను ప్రోత్సహించాడని ఆరోపిస్తూ ఈ కేసు నమోదైంది.

ఎన్నికల సమయంలో కేసు:గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు వెళ్ళినప్పుడు, ఆయన అనుచరులతో పోలింగ్ బూత్‌లోకి వెళ్ళి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఒక సామాజిక కార్యకర్త కేసు పెట్టారు.

తల్లిదండ్రులపై కేసు: గతంలో తన అనుమతి లేకుండా తన పేరును రాజకీయ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్ తన తల్లిదండ్రులు సహా 11 మందిపై కేసు వేశారు.

విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ఇలాంటి వివాదాలు, కేసులు సాధారణమైపోయాయి. ఆయన తన పార్టీ కార్యకలాపాలు విస్తరిస్తున్న కొద్దీ, ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అయితే, తాజా కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. 

Advertisment
తాజా కథనాలు