TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధితుల కుటుంబానికి విజయ్‌ ఎక్స్‌గ్రేసియా

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో  విజయ్‌ కరూర్‌ ర్యాలీ తొక్కిసలాట ఘటన బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.

New Update
tvk vijay

tvk vijay

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో  విజయ్‌(tvk vijay) కరూర్‌ ర్యాలీ తొక్కిసలాట ఘటన బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమినాడులోని కరూర్ లో విజయ్ నిర్వహించిన ఈ ర్యాలీలో 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 65 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. 

Also Read :  ఫుల్ మాస్.. 'పెద్ది' నుంచి చరణ్ కొత్త పోస్టర్ వైరల్!

బాధితులకు ఎక్స్ గ్రేషియా

ఈ ఘటనపై హీరో విజయ స్పందిస్తూ..  ''కరూర్ తొక్కిసలాట ఘటనతో నా హృదయం ముక్కలైంది. భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. నా బాధ  మాటల్లో వర్ణించలేనిది. నా ప్రియమైన తమ్ముళ్లు, చెల్లెళ్లకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు. 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి  టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కి చెందిన ఇద్దరు సహాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ నిర్మల్‌ కుమార్‌పై కూడా  ఎఫ్‌ఐఆర్‌ లు  నమోదు చేశారు.  అలాగే ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ప్రభుత్వం  ఒక కమిటీని కూడా  ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

Also Read :  మోడ్రన్ డ్రెస్‌లో తనూజ క్యూట్ ఫొటోలు.. కుర్రాళ్లను ఫిదా చేస్తున్న బ్యూటీ!

Advertisment
తాజా కథనాలు