/rtv/media/media_files/2025/03/13/vjLNnvqR5Oi33QVfDWeh.jpg)
Vijay strong counter to Nirmala Sitharaman for criticizing Periyar
TVK Vijay: పెరియార్‌పై విమర్శలు చేసిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిర్మాలమ్మ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రజల మనసులో ఆయన ఎలా నిలిచి ఉన్నారో, ఎలా గౌరవిస్తున్నారో ఒక్క ఉదాహరణ చాలన్నారు.
ప్రజల మనసులో చెరగని ముద్ర..
ఈ మేరకు రాజ్యసభలో సీతారామన్ మాట్లాడుతూ.. తమిళాన్ని అవమానించిన వ్యక్తికి పూలమాలలు వేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. దీంతో నిర్మల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన విజయ్.. ఏళ్లు గడిచినా ఆయన పేరు వాడకుండా ఉండలేని విధంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారన్నారు. సమాజంలో సాంఘిక దురాచారాలు పారదోలడానికి పెరియార్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. కులం పేరిట జరిగిన అకృత్యాలను ఆయన ఖండించారు. మనం ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు ఉండాలని ఆయన వందసంవత్సరాల క్రితమే పిలుపునిచ్చారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
అలాగే పెరియార్ తమిళ భాషను అవమానించినందుకు నిర్మలమ్మ నిజంగానే బాధపడ్డారా అని ప్రశ్నించారు. 'మీరు నిజంగా బాధపడి ఉంటే.. త్రిభాషా సూత్రాన్ని మాపై రుద్దడం ఆపేస్తారా? అని అడిగారు. పెరియార్ గురించి ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే అవి వివాదాస్పదం అవుతాయన్నారు. తమిళనాడు ప్రజల మనసులో ఆయన ఎలా నిలిచి ఉన్నారో, ఎలా గౌరవిస్తున్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలని చెప్పారు.
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్