CM అభ్యర్థిని ప్రకటించిన దళపతి విజయ్‌ టీవీకే పార్టీ

తమిళగ వెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకులు విజయ్‌ని ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని గతంలోనే స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు.

New Update
Vijay Thalapathy

తమిళనాడులో హీరో దళపతి విజయ్ గతేడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. 2026 జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీవీకే పార్టీ తాజాగా కీలక ప్రకటన చేసింది. తమిళగ వెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకులు విజయ్‌ని ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని గతంలోనే స్పష్టం చేశారు.

ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని గతంలోనే స్పష్టం చేశారు. ఇదే విషయంపై విజయ్‌ తాజాగా మరోసారి స్పష్టతనిచ్చారు. బీజేపీ, డీఎంకే, ఏఐడీఎంకే.. ఏ పార్టీతోనూ పొత్త ఉండదని తేల్చి చెప్పారు. డీఎంకే, బీజేపీకి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమనని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలు మద్దతు కూడగట్టేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ విజయ్‌ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని తెలిసింది. తమిళగ వెట్రి కళగం పార్టీని విజయ్‌ గతేడాది ఫిబ్రవరిలో స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీ స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ప్రశాంత్‌ కిషోర్‌ సహకరిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే చెన్నైలో విజయ్‌ను ప్రశాంత్‌ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు కూడా. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన విజయ్‌కి సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు