/rtv/media/media_files/2025/03/28/CHutlGIZ3fCxPPrkKcRL.jpg)
TVK Party Chief Vijay
TVK President Actor Vijay: తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు ఉన్నారు.
పదుల సంఖ్యలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కసలాట జరిగిన వెంటనే విజయ్ అర్థంతరంగా తన ప్రసంగాన్ని ముగించివేశారు.
కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు తెలిసింది. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిళ్లను అందించారు. భారీ సమూహంలో అంబులెన్సులు అక్కడకు చేరుకోవడం ఇబ్బందిగా మారడంతో మృతుల సంఖ్య పెరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🔴#BREAKING | கரூர் விஜயின் பிரச்சாரத்தின் போது ஏற்பட்ட கூட்ட நெரிசலில் சிக்கி 6 குழந்தைகள் உட்பட 13 பேர் உயிரிழப்பு
— Spark Media (@SparkMedia_TN) September 27, 2025
🔹முதலமைச்சர் மு.க.ஸ்டாலின் உத்தரவின் பேரில் கரூர் மருத்துவமனையில் முன்னாள் அமைச்சர் செந்தில் பாலாஜி விரைந்தார்
⚠️Trigger Warning pic.twitter.com/Ki3yOk3EpJ