/rtv/media/media_files/2025/03/28/CHutlGIZ3fCxPPrkKcRL.jpg)
TVK Party Chief Vijay
TVK Party: జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అలాగే డీలిమిటేషన్‌పై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పలు దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఈ అంశాలపై వాగ్వాదం జరుగుతోంది. ముఖ్యంగా వీటిపై తమిళనాడు ప్రభుత్వం గట్టిగా పోరాడుతోంది. ఈ క్రమంలోనే తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాష విధానం, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం తిరువన్మయూర్‌లో తొలి జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు.
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
టీవీకే పార్టీ సంచలన నిర్ణయం
ఈ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లు, త్రిభాష విధానంతో సహా 17 తీర్మానాలను టీవీకే ఆమోదించింది. ఈ భేటీలో పార్టీ అధినేత విజయ్ పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ తాము ద్విభాషా విధానానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మూడు భాషల విధానాన్ని అమలు చేయడం ఫెడరలిజానికి విరుద్ధమని తెలింది. దీన్ని తాము ఎన్నటికీ అంగీకరించమని తేల్చి చెప్పింది.
Also Read: భార్య అలా బెదిరించినా విడాకులు తీసుకోవచ్చు: హైకోర్టు
అలాగే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గుతాయని టీవీకే తీర్మానంలో తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోయిందని.. వీటిని నియంత్రించడంలో డీఎంకే పార్టీ విఫలమైందని విమర్శలు చేసింది. ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌పై తప్పుడు వాగ్దానాలు చేస్తోందని చెప్పింది. శ్రీలంకలో అరెస్టయిన భారతీయ మత్స్యకారుల సమస్యను సైతం లేవనెత్తింది. మత్స్యకారులకు తాము అండగా ఉంటామని.. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. మరోవైపు 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే పార్టీల మధ్యే పోరు ఉంటుదంని పార్టీ అధినేత విజయ్ అన్నారు.
Also Read: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం
telugu-news | rtv-news | tvk vijay | TVK President Vijay | tamil-nadu | delimitation
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!