/rtv/media/media_files/2025/08/21/tvk-2025-08-21-18-14-05.jpg)
తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట జరిగింది. మధురైలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. దాదాపుగా 4 లక్షల మంది సభకు హాజరయ్యారు. అయితే రద్దీ ఎక్కువ కావడంతో సభలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 400 మంది అస్వస్థతకు గురి కాగా ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరు మృతి చెందగా 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల బరిలోకి తమిళగ వెట్రి కళగం దిగబోతుందని, తానే సీఎం అభ్యర్థినని ప్రకటించారు కూడా . రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుందని విజయ్ ధీమాగా ఉన్నారు.
Follow Us