Silver Biscuits: ఒడిశాలో భారీ వెండి బిస్కెట్ల పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
ఒడిశాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల వెండి బిస్కెట్లను ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.1.10 కోట్లు ఉంటుదని అంచనా వేస్తున్నారు. కారు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.