Golden Silver Lizards : కంచిలో కలకలం.. ఆ బల్లుల తాపడాలు మార్చేశారా?

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురం వివాదంలో చిక్కుకుంది. కంచీపురంలోని వరదరాజ పెరుమాల్‌ ఆలయంలో ఉన్న బల్లుల విగ్రహాలకు ఉన్న బంగారు, వెండి తాపడాలను మార్చినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది.

New Update
FotoJet - 2025-11-06T141959.694

golden and silver lizard temple tamil nadu

Kanchi Temple: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురం వివాదంలో చిక్కుకుంది. కంచీపురం(kanchipuram)లోని వరదరాజ పెరుమాల్‌ ఆలయంలో ఉన్న బల్లుల విగ్రహాలకు ఉన్న బంగారు, వెండి తాపడాలను మార్చినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. కంచి ఆలయంలోని (Kanchi Temple) బంగారు, వెండి బల్లుల విగ్రహాల (Golden Silver Lizards) తాపడాలను మార్చినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రఖ్యాతి గాంచిన కాంచీపరంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో ప్రస్తుతం ఆలయ పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని పురాతన బంగారు, వెండి బల్లుల తాపడాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటుచేసినట్లు శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ అనే భక్తుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో బుధవారం ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని పోలీసులు 8 గంటల పాటు విచారించడం చర్చనీయంశమైంది. ఆమెతో పాటు ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా అవసరమైన ప్పుడు విచారణకు రావాలని ఆలయ ఈవో, సిబ్బందిని పోలీసులు ఆదేశించినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: Bus Accident: చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం.. డివైడర్ ఎక్కడంతో స్పాట్‌లో..!

ఇక 108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలోని ఈ ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లులు విశిష్టమైనవి అని తెలిసిందే. నిత్యం ఈ ఆలయాన్ని దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఆలయంలోని బంగారు, వెండి బల్లులను తాకితే సకల దోషనివారణ జరుగుతుందని నమ్ముతారు. 

పురాణ గాథ ప్రకారం.. ప్రసిద్ధుడైన గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. వారు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో ఓ బల్లి పడింది. ఆ విషయాన్ని శిష్యులు గుర్తించలేదు. అది చూసిన గౌతమ మహర్షి ఆగ్రహంతో వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. అయితే తెలియక జరిగిన తప్పును క్షమించమని, శాప విముక్తి ప్రసాదించమని శిశ్యులు ప్రార్థించారు. దీంతో మనసు కరిగిన మహర్షి కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయం లోనే మీకు విముక్తి లభిస్తుందని ఉపశమనం తెలియజేశాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లుల‌ రూపంలో ఉండి స్వామి వారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఆ సమయంలో సూర్య, చంద్రు లు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపాల్లో శిష్యుల శరీరాలు బల్లుల బొమ్మలుగా ఉండి  స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దోష నివారణ చేయమని మహర్షి ఆదేశించాడు. అలా వారిద్దరూ అక్కడే ఉండి దోష నివారణ కోసం తమను తాకిన వారికి విముక్తి కలిగిస్తున్నారని చెబుతారు. కాగా బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థం.

Also Read: Trump: కమ్యూనిజం vs కామన్ సెన్స్.. మామ్దానీ విజయంపై ట్రంప్ వ్యాఖ్య

Advertisment
తాజా కథనాలు