RBI New Rules : ఆర్‌బీఐ కీలక ప్రకటన.. బంగారమే కాదు దానిపై కూడా లోన్‌

ప్రస్తుతం దేశంలో సిల్వర్ రేటు కిలోకు రూ. 1.70 లక్షల వరకు పలుకుతుంది. ఈ తరుణంలో రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక ప్రకటన జారీ చేసింది.  అదేంటంటే బంగారం మాదిరిగానే.. సిల్వర్ మీద కూడా లోన్ ఇస్తామని ప్రకటించింది.

New Update
Silver Jewellery

Silver Jewellery

RBI New Rules : బంగారం ధర అమాంతం పెరిగి లక్షమార్కును దాటింది. ఇప్పుడు వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. బంగారం ధరల లాగానే.. వెండి ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. కేజీ వెండి రేటు రూ. 2 లక్షలు దాటిన ఆశ్చర్యపోనక్కరలేదు. ప్రస్తుతం దేశంలో సిల్వర్ రేటు కిలోకు రూ. 1.70 లక్షల వరకు పలుకుతుంది. ఈ తరుణంలో రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక ప్రకటన జారీ చేసింది.  అదేంటంటే బంగారం మాదిరిగానే.. సిల్వర్ మీద కూడా లోన్ ఇస్తామని ప్రకటించింది.
 
దీనికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం వెండి నగలు, కాయిన్స్ వంటి వాటిని తాకట్టు పెట్టుకుని లోన్ మంజూరు చేయాలని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లను తాకట్టుపెట్టడానికి మాత్రం అవకాశం లేదు. వీటిపై లోన్ కూడా లభించదు.

ఇక ఆర్‌బీఐ సూచనల ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వెండి వరకు తాకట్టుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. వీటితో పాటు 500 గ్రాముల వరకు బరువున్న సిల్వర్ కాయిన్స్ కూడా బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇంతకంటే ఎక్కువ బరువున్న వెండిని తాకట్టు పెట్టుకోకూడదని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి. మొత్తం మీద వెండిపై రూ. 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బంగారం మాదిరిగానే.. వెండి మార్కెట్ విలువ ఆధారంగా బ్యాంకులు లోన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపింది.
 
వెండిని కేవలం నగలు, అలంకారానికి మాత్రమే కాకుండా.. పూజ సామాగ్రిగా కూడా ఉపయోగిస్తారు. పారిశ్రామిక రంగంలో కూడా సిల్వర్ డిమాండ్ భారీగా పెరగడం మూలంగా. వెండి రేటుకు రెక్కలొశ్చాయి. సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, ఉత్ప్రేరకాలు, నీటి శుద్ధి, వైద్య రంగం, ఫొటోగ్రఫీ వంటి వాటిలో కూడా వెండిని విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల సిల్వర్ రేటు గణనీయంగా పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు