Gold Prices Drop: బంగారం ప్రియులకు అదిరిపోయే వార్త.. రికార్డు స్థాయిలో రూ.13 వేలు తగ్గుదల

అకస్మాత్తుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో రూ.1.32 లక్షలకు పైగా ఉండగా, ఇప్పుడు రూ.1.18 లక్షలకు పడిపోయింది. ఇలా చూసుకుంంటే రికార్డు స్థాయిలో బంగారం ధరలు రూ.13,000 కంటే ఎక్కువ తగ్గాయి.

New Update
Gold rate

Gold rate

ప్రస్తుతం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో గరిష్టంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దాదాపుగా రూ.2 లక్షల వరకు వెళ్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. వాటి తగ్గట్లుగానే బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే అకస్మాత్తుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో రూ.1.32 లక్షలకు పైగా ఉండగా, ఇప్పుడు రూ.1.18 లక్షలకు పడిపోయింది. ఇలా చూసుకుంంటే రికార్డు స్థాయిలో బంగారం ధరలు రూ.13,000 కంటే ఎక్కువ తగ్గాయి. ఇక వెండి కూడా భారీగానే తగ్గుతోంది. వెండి ధరలు రికార్డు స్థాయిలో కిలోకు రూ.1.70 లక్షల నుంచి కిలోకు రూ.1.41 లక్షలకు పడిపోయాయి. రికార్డు స్థాయిలో రూ.29 వేల వరకు తగ్గింది. 

ఇది కూడా చూడండి: Stock Market: కొత్త పెట్టుబడులకు అవకాశాలు..ఐపీవోలను ప్రారంభించిన 5 కొత్త కంపెనీలు

నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇదిలా ఉండగా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 760 పెరిగి.. రూ.1,21,580గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,450గా ఉంది. అయితే దేశ వ్యాప్తంగా ఇవే ధరలు ఉండవు. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. 

ఇది కూడా చూడండి: Best Business Idea: తక్కువ పెట్టుబడితో నెలకు ఈజీగా రూ.30 వేలు.. అదిరిపోయే బిజినెస్ ఐడియా అంటే ఇదే గురూ!

Advertisment
తాజా కథనాలు