/rtv/media/media_files/2026/01/19/silver-2026-01-19-18-22-53.jpg)
Silver appears to be the new gold, jewellers see rush silver bars and coins
ప్రస్తుతం వెండి రేట్లు(silver rates) కూడా బంగారం ధరల్లా పెరిగిపోతున్నాయి. దీంతో సిల్వర్‌కు కూడా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు దీన్ని పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు. జ్యువెలరీ షాపుల్లో వెండి నగలు మాత్రమే కాకుండా వెండి బిస్కెట్లు, నాణేల కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు గత రెండేళ్లలో బంగారం కంటే వెండిపై వచ్చిన రాబడి అధికంగా ఉంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ రంగాల్లో వెండి వాడకం పెరగడం కూడా దీనికి కలిసొచ్చింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న అమ్రపాలి జ్యూవెలరీ సీఈవో తరంగ్ అరోరా వెండి గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ షాప్‌లో వినియోగదారుల అభ్యర్థన మేరకు వెండి బిస్కెట్లు అమ్మడం ప్రారంభించామని తెలిపారు. గతంలో సిల్వర్‌ను ఎక్కువగా పట్టించుకునేవాళ్లు కాదని.. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు సిల్వర్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. - gold-and-silver-rates
Also Read: కుల్దీప్ సెంగర్‌కు బిగ్ షాక్.. శిక్ష రద్దు పిటిషన్‌ను కొట్టివేసి కోర్టు
Silver Appears To Be The New Gold
2025-2026 ఆర్థిక సంవత్సరంలో గతేడాదితో పోలీస్తే వెండి బిస్కెట్లు, నాణేలు కొనేవారి సంఖ్య 50 శాతానికి పెరిగిందని 'గార్గి బై PN గాడ్గిల్ అండ్ సన్స్' కో ఫౌండర్ ఆదిత్య మోదక్ తెలిపారు. బంగారం ధరలు విపరీతంగా పెరగంతో అది సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందన్నారు. అందుకే అందుకే చాలామంది వెండి వైపు మళ్లారని పేర్కొన్నారు. దీపావళి సమయంలో వెండి ధరలు కూడా పెరగడంతో కార్పొరేట్ సంస్థలు తక్కువ బరువున్న వెండి నాణేలను గిఫ్టింగ్ కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అలాగే వినియోగదారులు వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడలేదన్నారు.
Also Read: కర్ణాటక డీజీపీ సెక్స్ స్కాండల్.. బయటపడ్డ షాకింగ్ వీడియోలు!
గత మూడు నెలల్లోనే సిల్వర్ బిస్కెట్లు, బలియన్‌ను విపరీతంగా కొనుగోలు చేశారని చెప్పారు. బంగారం ఇచ్చేంత స్థిరత్వం వెండిలో ఉండదని.. కానీ బంగారం కంటే వెండి ఎక్కువ లాభాలను ఇచ్చిందని పేర్కొన్నారు. అలాగే వెండితో ముడిపడి ఉన్న రిస్క్ కూడా ఎక్కువేనన్నారు. ఇందులో రిస్క్ ఎంతగా ఉంటుందో భారీ లాభాలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇదిలాఉండగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), సోలార్ ప్యానెల్స్, సెమీకండక్టర్ల పరిశ్రమల నుండి విపరీతమైన డిమాండ్ రావడంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఔన్సుకు 90 డాలర్ల మార్కును దాటింది. అలాగే రూపాయి విలువ బలహీనపడటంతో దేశీయ స్పాట్ మార్కెట్లలో వెండి ధర మొదటిసారిగా కిలోకు 3 లక్షల రూపాయల మార్కును దాటడం మరో విశేషం. - business news telugu
Follow Us