Silver Rates: అమాంతం పెరిగి...అంతలోనే ఢమాల్ అని పడిపోయింది..వెండి దూకుడికి బ్రేక్

ఆకాశమే హద్దుగా వెండి ధర పెరిగింది. కానీ అంతలోనే దానికి బ్రేక్ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ఢమాల్‌మని కిందకు పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది.

New Update
silver

వెండి ధర రోజురోజుకూ పెరుగుతూ పోయింది. పారిశ్రామిక అవసరాల నిమిత్తం ముఖ్యంగా 5జీ, విద్యుత్తు వాహనాలు, సౌర విద్యుత్తు రంగాల నుంచి ఈ లోహానికి లభిస్తున్న గిరాకీ వల్ల ధర ధర పెరుగుతోంది. వెండిపై పెట్టుబడులు పెట్టిన వారి సంపద విలువ వృద్ధి చెందుతున్నందున, మరింతమంది ఆన్‌లైన్‌లో, లోహం రూపేణ కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌ విలువ పరంగానూ వెండి అరుదైన ఘనత సొంతం చేసుకుంది.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్‌ విలువ బంగారానిదే. తరవాత స్థానంలో అమెరికా చిప్‌ దిగ్గజ సంస్థ ఎన్‌వీడియా మార్కెట్‌ విలువ ఉంది. ఆ తరవాత స్థానంలోకి వెండి చేరింది. వెండి మార్కెట్‌ విలువ సుమారు రూ.380 లక్షల కోట్లుగా పరిగణిస్తున్నారు.

కానీ ఇది కొంత సమయం క్రితం వరకు మాత్రమే..ఇప్పుడు వెండి ధర ఒక్కసారిగా పడిపోయింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది. ఈ రోజు ఇంట్రాడేలో రూ.2,54,174 వద్ద గరిష్ఠాన్ని తాకిన కిలో వెండి ధర రూ.2,33,120 వద్ద కనిష్ఠాన్ని తాకింది. స్పాట్ మార్కెట్ లో కూడా దీని ధర తగ్గింది. రూ.2.50 లక్షలు పైబడి పలికిన కేజీ వెండి ధర హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి రూ.2.39 లక్షల స్థాయికి దిగి వచ్చింది. గరిష్టాల దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే వెండి ధర పడిపోయిపట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా వెండి ధర డిమాండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. అయితే వెండి ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు 181శాతం మేర పెరిగింది. గరిష్ఠాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమూ వెండి ధర పతనానికి కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వెండి 200డే మూవింగ్యావరేజీకంటే 89 శాతం పైనేట్రేడవుతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..

వెండిలో అమ్మకాల ఒత్తిడి పెరగడానికి చికాగో మర్చంట్‌ ఎక్స్ఛేంజీ కూడా మరో కారణమని తెలుస్తోంది. ఈ గ్రూప్‌లో ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్ఎక్స్ఛేంజ్‌లను నిర్వహిస్తోంది. 2026 మార్చి ఫ్యూచర్‌ కాంట్రాక్ట్‌కు సంబంధించిన మార్జిన్‌ను 20వేల డాలర్ల నుంచి 25వేల డాలర్లకు పెంచింది. దీంతో అధిక రిస్క్ తీసుకునే వారు వెనకడుగు వేయడంతో వెండిలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భేటీ కూడా వెండి ధర పతనానికి కారణం అయింది.వీరిద్దరూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని సూచనలిచ్చారు. ఇది మార్కెట్ పతనానికి కారణం అయింది.

మరోవైపు వరుసగా నాలుగో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. ఐటీ, రియల్టీ, ఫార్మా, ఆటో స్టాక్స్‌లో అమ్మకాలు ప్రభావం చూపాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, సూచీలను ముందుకు నడిపించే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే ముగిసాయి. దీనికి తోడు ఏడాది ముగుస్తుండడంతో మార్కెట్ ఉత్సాహంగా లేదని నిపుణులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు