/rtv/media/media_files/2025/10/07/gold-2025-10-07-13-06-20.jpg)
Gold and silver prices
Gold, Silver Rates :దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందనంత దూరంగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. దేశంలో బంగారం ధర రూ.2 లక్షలకు చేరువవుతుండగా వెండి ధర రూ.4.2 లక్షలను దాటేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బంగారం, వెండి ధరల పరుగు రెట్టింపు స్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇటీవలి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాల్లో ప్రమాణిక వడ్డీ రేటు యథాతథంగా కొనసాగినా డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. అంతర్జాతీయ మార్కెట్స్‌ను అనుసరిస్తూ దేశీయంగా బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు 12 వేల వరకు పెరగగా, కిలో వెండి రూ.30 వేల వరకు పెరిగింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో బంగారం, వెండిధరలు గరిష్టంగా పెరిగినట్లు వర్తకులు తెలిపారు. మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,886 గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,63,960కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో దాదాపు ఇదే రేటు కొనసాగుతోంది. ఇక చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,83,290 వద్ద, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,010 వద్ద ట్రేడవుతుండటం గమనార్హం
బంగారంతో పోటీ పడుతూ..
ఇక వెండి కూడా బంగారంతో పోటీ పడుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.4,25,100 వద్ద కొనసాగుతుంది. దేశరాజధాని ఢిల్లీలో కూడా సుమారు ఇదే రేటు కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం కిలో వెండి రేటు రూ.4.10 లక్షలు పలుకుతుండటం కొంత ఊరటనిచ్చే అంశం.
Follow Us