/rtv/media/media_files/2025/10/17/why-gold-and-prices-are-sky-rocketing-2025-10-17-18-49-36.jpg)
why gold and prices are sky rocketing ? Know Details
బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. తులం బంగారం కావాలంటే సామాన్యులు కొనే పరిస్థితులు లేవు. భారత్‌లో ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,28,890 ఉంది. కిలో వెండి ధర రూ.1,90,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నాయనేది చాలా మందిలో సందేహం నెలకొంది. మన దేశంలో వీటి ధరలు పెరిగేందుకు ప్రధానంగా అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ కారణాలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు నెలకొన్నాయి. వివిధ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఉదాహరణకి రష్యా,ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు, భారత్-పాక్ ఘర్షణలు అనేవి కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తుంటారు. బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. దీనివల్ల వాటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతుంది.
Also Read: అఫ్గాన్, భారత్‌తో యుద్ధానికి సిద్ధం.. పాక్ సంచలన ప్రకటన
ద్రవ్యోల్బణం
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ద్రవ్యోల్బణం నెలకొంది. ఇలా జరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది. దీంతో తమ సంపదను కాపాడుకునేందుకు బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల వాటి ధరలు పెరిగిపోతాయి.
డాలర్ విలువ పడిపోవడం
సాధారణంగా బంగారం ధరలను డాలర్లలోనే నిర్ణయిస్తారు. అయితే డాలర్ విలువ తగ్గిన సమయంలో డార్‌యేతర కరెన్సీలు ఉన్న కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు చౌకగా మారుతాయి. చివరికి ఇది డిమాండ్‌ను పెంచుతుంది. దీనివల్ల వీటి ధరలు పెరుగుతాయి. అలాగే ట్రంప్ సుంకాల విధానం కూడా ఈ ధరల పెరుగుదలకు దారితీశాయి.
సెంట్రల్ బ్యాంకుల ప్రభావం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇందుకోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ కొనుగోళ్లు కూడా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అంతేకాదు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ లాంటి పలు సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తాయనే అంచనాలు వచ్చినప్పుడు.. వడ్డీ ఇవ్వని ఆస్తి అయిన బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆకర్షితులైతారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి.
Also Read: పిచ్చి వేషాలు వేస్తే...లోపలికి వెళ్ళి మరీ చంపేస్తాం..హమాస్‌ను హెచ్చరించిన ట్రంప్
దేశీయ అంశాలు
భారత్ బంగారాన్ని, వెండిని దిగుమతి చేసుకుంటుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయినప్పుడు దిగుమతి ఖర్చు మరింత పెరుగుతుంది. దీనివల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతాయి. భారత్‌లో బంగారానికి ఎంతో విలువ ఇస్తారు. పండుగ సమయాల్లో, విహహా సీజన్లలో కూడా బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా పెరుగుతాయి. ఫలితంగా ధరలు కూడా పెరిగిపోతాయి. అంతేకాదు డిమాండ్‌కు తగ్గట్టుగా బంగారం, వెండి ఉత్పత్తి మైనింగ్ లేకపోవడం వల్ల అలాగే అంతర్జాతీయ సరఫరా గోలుసులో అంతరాయాలు రావడం వల్ల కూడా ఈ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అంశాలన్ని నెలకొన్న నేపథ్యంలోనే దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి .
Also Read: హెచ్ 1బీ వీసా ఫీజుల విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్