కూర్మన్నపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
విశాఖ స్టీల్ సిటీ వద్ద రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. అనకాపల్లి నుంచి కూర్మన్నపాలెం బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వీరి ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.