/rtv/media/media_files/2025/06/04/JD7pfh7lxcPHamLehPdv.jpg)
travel bus road accident Photograph: (travel bus road accident)
TG Crime : తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఓ లారీని వెనకనుంచి మరోలారి ఢీ కొట్టింది. ఆ లారీ వెనుక ఉన్న మరోలారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ లారీ వెనుక వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా పలువురికి గాయలయ్యాయి.
Also Read: ఉక్రెయిన్‌ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు
వనపర్తి జిల్లా ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకదాని వెనుక ఒకటిగా వస్తున్న లారీల్లో ఒకదాన్నొకటి ఢీ కొట్టాయి. అయితే వారి వెనుక వస్తున్న మూడో లారీ డ్రైవర్ దాన్ని గమనించి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో ఆ లారీ వెనుక వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ వేగంగా వచ్చి లారీని ఢీకొన్నాడు. దీంతో బస్సు డోరువద్ద ఉన్న క్లీనర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
ఈ ప్రమాదం వనపర్తి జిల్లా పెబ్బేర్ బైపాస్ సమీపంలోని NH 44 జాతీయ రహదారిపై జరగడంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒకదానికొకటి వరుసగా లారీలు ప్రమాదానికి గురి కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఇచ్చి సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఉక్రెయిన్‌ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు