BREAKING: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన టూరిస్టులు పరిగిలో జరిగిన విందుకు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కాకినాడ జిల్లా తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులు మృతి చెందినట్లు గుర్తించారు.
విజయవాడ-మచిలీపట్నం హైవేపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తాపడింది. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు డ్రింక్స్ కేసులను తీసుకెళ్తున్నారు.
ఛత్తీస్ ఘడ్ లో రాయ్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ పూర్-బలోడా బజార్ రోడ్డులో సారగావ్ సమీపంలో ట్రైలర్ వాహనాన్ని ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 క్రైం | Short News | Latest News In Telugu
ఏపీ బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ పలకల కింద పడి స్పాట్లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‌దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లో పవన్ దీప్ ప్రయాణిస్తోన్నకారు ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మూలపాడు వద్ద కూలీలతో రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోను బొలెరో ఢి కొట్టింది. ఇద్దరు మహిళలు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా బట్టేరే చాష్మా వద్ద ఈ ఘటన జరిగింది.