/rtv/media/media_files/2025/06/14/cPRsgAek2zO4Knp0Pwrf.jpg)
karnataka road accident ap residents died
రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అధిక వేగం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ కారణంగా అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు హొసకోటె గొట్టిపుర గేట్ సమీపంలో ప్రమాదానికి గురైంది.
ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!
Karnataka Road Accident
ఈ ఘోరమైన ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. అయితే వారంతా ఏపీ వాసులు కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారే. అందులో వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన కేశవులురెడ్డి (45), తమ్ముడి కుమారుడు హిత్విక్ (4 నెలలు), జీడీనెల్లూరు మండలం మారేడుపల్లెకు చెందిన శారద (45), శ్రీరంగరాజపురం మండలం పుల్లూరుకు చెందిన తులసి (21), తిరుపతి జిల్లా రామచంద్రాపురం తిమ్మరాజుపల్లెకు చెందిన ఒంటెల హరిబాబు కుమార్తె ప్రణతి (4) ఉన్నారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!
అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని హొసకోటెలోని సిలికాన్ సిటీ, ఎంవీజే హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఒక లారీని ఓవర్ ట్రాక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సు ఒక పక్క మొత్తం నుజ్జు నుజ్జయింది.
Also Read : Manchu Lakshmi: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్
road-accident | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news
Follow Us