BIG BREAKING: రెండోసారి వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ
ఆర్బీఐ మళ్ళీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈసారి కూడా వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచినట్లు తెలిపింది. రెండోసారి రెపోరేట్‌ను 5.5 శాతం వద్దే కొనసాగించింది.
ఆర్బీఐ మళ్ళీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈసారి కూడా వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచినట్లు తెలిపింది. రెండోసారి రెపోరేట్‌ను 5.5 శాతం వద్దే కొనసాగించింది.
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు క్లెయిమ్ కోసం ఇప్పటి వరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. కానీ ఇకపై నామినీ కింద నలుగురు పేర్లను ఎంచుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
ఫోన్ కొనుగోలుకు లోన్ తీసుకుని తిరిగి చెల్లించని వారికి ఆర్బీఐ బిగ్ షాక్ ఇచ్చింది. RBI కొత్త నిబంధనల ప్రకారం.. రుణం తిరిగి చెల్లించనివారి ఫోన్లను బ్యాంకులు నిలిపివేస్తాయి. దీంతో కాల్స్, ఇంటర్నెట్, అప్లికేషన్స్ పనిచేయవు. ఈ నిబంధనలు త్వరలో అమలులోకి వస్తాయి.
నిరుద్యోగులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్బీఐ గ్రేడ్ 'బి' ఆఫీసర్ 120 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ. 78,450 జీతం ఉండే ఈ పోస్టులకు చివరి తేదీ సెప్టెంబర్ 30.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. మినిమం బ్యాలెన్స్ ను భారీగా పెంచేసింది. ఇప్పటివరకు రూ. 10 వేలుగా ఉన్న మినిమం బ్యాలెన్స్ ను ఏకంగా రూ. 25 వేలకు పెంచుతున్నట్లుగా కీలక ప్రకటన చేసింది.
2025 జూలైలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గి 1.55 శాతానికి చేరింది. ఇది ధరల తగ్గుదలను సూచిస్తోంది. గత 8 ఏళ్లలో నమోదైన అత్యల్ప ద్రవ్యోల్బణ రేటు ఇది. ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఈ తగ్గుదలకు కారణమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ డెడ్ ఎకానమీ అంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు.
నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 80,800 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు పెరిగి 24,650 దగ్గర ఫ్లాట్ గా ఉంది.