/rtv/media/media_files/2025/09/17/savings-account-2025-09-17-15-52-15.jpg)
Savings account
బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ప్రస్తుతం చాలా మందికి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి తప్పకుండా ఒక అకౌంట్‌ను మెయింటైన్ చేస్తుంటారు. మరికొందరు డబ్బులు, విలువైన పత్రాలు దాచుకునేందుకు బ్యాంకు లాకర్ తీసుకోవడానికి సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. అయితే ఇలా సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి ఆర్‌బీఐ కొన్ని రూల్స్‌ను తీసుకొచ్చింది. మొత్తం 6 కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. సేవింగ్స్ అకౌంట్‌కు ఇప్పటి వరకు ఒకరి పేరుని నామినీగా చేర్చడానికి వీలు ఉంది. కానీ ఇప్పటి నుంచి సేవింగ్స్ అకౌంట్‌కు నలుగురు పేర్లను నామినీగా చేర్చేలా ఆర్‌బీఐ మార్పులు చేసింది. బ్యాంకు ఖాతాలు, లాకర్లలో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడంతో పాటు చట్టపరమైన వారసులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకరే నామినీగా ఉంటే ఖాతాదారు చనిపోతే అవి వారసులకు అందడం కష్టం అవుతుంది. అదే నలుగరు నామినీలు ఉంటే మాత్రం వారసులకు ఖాతాదారుల లాకర్‌లో ఉన్న అన్ని వస్తువులు అందుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూల్‌ను తీసుకొచ్చింది.
ఇది కూడా చూడండి: Mobile Offers: రచ్చ రంబోలా.. AMAZONలో మడత ఫోన్‌పై రూ.82వేల భారీ డిస్కౌంట్ - అరాచకమైన ఆఫర్..!
పర్సంటేజ్ బట్టి..
సాధారణంగా బ్యాంకుల్లో రెండు రకాల నామినేషన్ ఆప్షన్లు ఉంటాయి. ఒకే సమయంలో నలుగురి పేర్లను నామినీగా ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఇది 40:30:20:10 పర్సంటేజ్ విధంగా ఉంటుంది. రెండోది సక్సెసివ్ నామినేషన్ విధానంలో ఉంటుంది. ఇందులో నామినీలను ప్రియారిటీ ప్రకారం ఎంచుకోవచ్చు. ఇందులో మొదటి నామినీకి క్లెయిమ్ రాకపోతే ఆటోమెటిక్‌గా రెండో నామినీకి క్లెయిమ్ పొందే అర్హత వస్తుంది. కొందరు రూ.10 లక్షలకు క్లెయిమ్ ఉంటే వాటిని ముగ్గురు నామినీలకు 40:30:30 ప్రకారం డబ్బులు పంచుతారు. అదే రెండో విధానం సక్సెసివ్ నామినేషన్ అయితే మొదటి వ్యక్తి క్లెయిమ్ చేయకపోతే రెండో వ్యక్తికి మొత్తం డబ్బులు ఇస్తారు. రెండో వ్యక్తి కూడా క్లెయిమ్ చేయకపోతే మూడో వ్యక్తికి ఇస్తారు.
ఇది కూడా చూడండి: IPhone 17 Series Price In India: ఐఫోన్ 17 సిరీస్ సేల్ రెడీ.. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు - ఇండియాలో ధర ఎంతంటే?
అలాగే బ్యాంక్ లాకర్ విషయానికి వస్తే ఇందులో నలుగురు పేర్లు సెలక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం సక్సెసివ్ నామినేషన్‌కి మాత్రమే అనుమతి ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ టైప్ రెండు రూల్స్ ఉండవు. మొదటి నామినీ ఎవరూ క్లెయిమ్ చేయకపోతేనే తర్వాత నామినీకి అర్హత వస్తుంది. ఎవరూ కూడా క్లెయిమ్ చేయకపోతే మొత్తం డబ్బులు కూడా వారికే ఇచ్చేస్తారు. ఈ కొత్త నామినీలో మారిన రూల్స్ వల్ల బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మారిన కొత్త రూల్స్ వల్ల మరణించిన తర్వాత క్లెయిమ్ ఈజీగా పొందవచ్చు.