BIG BREAKING: రెండోసారి వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ

ఆర్బీఐ మళ్ళీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈసారి కూడా వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచినట్లు తెలిపింది. రెండోసారి రెపోరేట్‌ను 5.5 శాతం వద్దే కొనసాగించింది.

New Update
India contributing more to global growth than the America, Says RBI Governor

India contributing more to global growth than the America, Says RBI Governor

ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. రెపో రేట్‌ను మరోసారి యథాతథంగా ఉంచింది. వరుసగా రెండోసారి రెపో రేట్‌ను 5.5 శాతం వద్దే కొనసాగించింది. దీంతో పాటూ ద్రవ్య విధాన వైఖరిని తటస్థంగా ఉంచాలని ఎమ్పీసీ నిర్ణయించిందని ఆర్బీఐ చీఫ్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలను విధించిన తర్వాత ఎమ్పీసీ సమావేశం కీలకంగా మారిందని ఆయన తెలిపారు. 

జీఎస్టీ స్లాబ్ రేట్లు, అదనపు సుంకాల ప్రభావం..

అంతకు ముందు ఆగస్టు మొదటి వారంలో జరిగిన సమావేశంలో కూడా రెపో రేటును మార్చలేదు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ 2025లో మొత్తం 100 బేసిస్ పాయింట్లతో వరుసగా మూడు కోతలు విధించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. అలా మూడు వరుస సమీక్షల్లో కలిపి రెపోరేట్‌ 1% తగ్గింది.  దీని ఫలితంగా రెపో రేటు 6.5 శాతం నుండి తగ్గింది. జీఎస్టీ స్లాబ్ రేట్ల మారడం, ట్రంప్ అదనపు సుంకాలు, హెచ్ 1బీ వీసా తదితర అంశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని ప్రభావితం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు