RBI Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.78 వేల జీతంతో ఆర్‌బీఐలో అదిరిపోయే ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్బీఐ గ్రేడ్ 'బి' ఆఫీసర్ 120 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ. 78,450 జీతం ఉండే ఈ పోస్టులకు చివరి తేదీ సెప్టెంబర్ 30.

New Update
RBI

RBI

ఉద్యోగం కోసం చూస్తున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. నిరుద్యోగుల కోసం ఆర్బీఐ గ్రేడ్ 'బి' ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 120 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో జనరల్, డీఈపీఆర్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్), డీఎస్ఐఎం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్) విభాగాల్లో భర్తీ చేయనుంది. వీటికి అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ rbi.org.in లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. 

ఇది కూడా చూడండి: IBPS - RRB JOBS: డిగ్రీ అర్హతతో 13217 ఉద్యోగాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు - పూర్తి వివరాలివే

లాస్ట్ డేట్ ఆరోజే..

మొత్తం 120  పోస్టుల్లో 83 పోస్టులు జనరల్ క్యాడర్‌లో ఉన్నాయి. డీఈపీఆర్ విభాగంలో 17 పోస్టులు, డీఎస్ఐఎం విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి.  అయితే జనరల్ క్యాడర్ పోస్టులకు ఫేజ్ 1 పరీక్షను అక్టోబర్ 18వ తేదీన నిర్వహిస్తారు. ఫేజ్-II పరీక్షను డిసెంబర్ 6వ తేదీన నిర్వహిస్తారు. ఇక డీఈపీఆర్, డీఎస్ఐఎం విభాగాల కోసం ఫేజ్-I పరీక్ష అక్టోబర్ 19న, ఫేజ్-II పరీక్షను డిసెంబర్ 7న నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీలు, దివ్యాంగులకు, మాజీ సైనికులకు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. విద్యార్హతల విషయానికి వస్తే జనరల్ క్యాడర్‌కు దరఖాస్తు చేయడానికి ఏదైనా విభాగంలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 

ఇది కూడా చూడండి: TGPSC Group-1: రీ వాల్యుయేషన్ కాదు.. గ్రూప్-1 మళ్లీ నిర్వహించడమే బెస్ట్.. ఎందుకంటే?

పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసిన వారికి కనీసం 55% మార్కులు అవసరం. డీఈపీఆర్ పోస్టులకు ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్‌లో మాస్టర్ డిగ్రీ 55% మార్కులు ఉండాలి. డీఎస్ఐఎం పోస్టులకు స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ వంటి సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీలో 60% మార్కులు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం లభిస్తుంది. ప్రారంభ బేసిక్ పే నెలకు రూ. 78,450 ఉంటుంది. ఇతర భత్యాలతో కలిపి మొత్తం జీతం నెలకు సుమారు రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు రూ.850 + జీఎస్టీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు రూ.100 + జీఎస్టీ ఉంటుంది. ఇది కాకుండా ప్రస్తుతం ఆర్బీఐలో పనిచేస్తున్న వారికి దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది. 

Advertisment
తాజా కథనాలు