GOOD NEWS: వెండిపై కూడా బ్యాంక్‌ లోన్స్.. RBI కొత్త మార్గదర్శకాలు విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో వెండి ఆభరణాలు, వెండి నాణేలపై కూడా రుణాలు అందించేందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధానంగా బంగారు రుణాలకే పరిమితమైన ఈ సౌకర్యం, త్వరలో వెండిపైనా లభించనుంది.

New Update
silver loan

ఆర్భీఐ బ్యాంక్ పేద, మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త చెప్పింది. బంగారం కొని స్థోమత లేని చాలా మధ్య తరగతి కుటుంబాలు వెండి కొంటాయి. వారికేమైనా అవసరమైనప్పుడు అది తాకట్టు పెట్టి లోన్ తీసుకుందామంటే బ్యాంకులు మాత్రం రుణాలు ఇవ్వవు. అయితే మీ ఇంట్లో వెండి ఆభరణాలు, నాణేలు ఉంటే అవి ఇప్పుడు డబ్బులు మారతాయి. ఇప్పటి వరకు గోల్డ్‌పై మాత్రమే బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం చూసి ఉంటారు. ఇకపై వెండిని తాకట్టు పెట్టి కూడా బ్యాంకులో రుణం తీసుకోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో వెండి ఆభరణాలు, వెండి నాణేలపై కూడా రుణాలు అందించేందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధానంగా బంగారు రుణాలకే పరిమితమైన ఈ సౌకర్యం, త్వరలో వెండిపైనా లభించనుంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్నాయి.

తాకట్టు పెట్టే వెండిపై ముఖ్య మార్గదర్శకాలు ఇవే:


వెండి ఆభరణాలు: గరిష్టంగా 10 కిలోగ్రాములు వరకు మాత్రమే తాకట్టు పెట్టడానికి అనుమతి ఉంది.
వెండి నాణేలు: గరిష్టంగా 500 గ్రాముల వరకు తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ పరిమితి ప్రతి ఒక్క రుణగ్రహీతకు, అన్ని బ్యాంకు శాఖలకూ వర్తిస్తుంది.
లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తి: తాకట్టు పెట్టే వెండి విలువలో ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించే LTV నిష్పత్తిని ఆర్బీఐ రుణ మొత్తాన్ని బట్టి నిర్ణయించింది.
రూ. 2.5 లక్షల వరకు రుణాలు: గరిష్టంగా వెండి విలువలో 85% వరకు లోన్ పొందవచ్చు.
రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు రుణాలు: గరిష్టంగా 80% వరకు లోన్ తీసుకోవచ్చు.
రూ. 5 లక్షలకు మించిన రుణాలు: గరిష్టంగా 75% వరకు రుణం పొందవచ్చు.
విలువ నిర్ధారణ: రుణ గ్రహీత సమక్షంలోనే వెండి ఆభరణాలు, నాణేల విలువను కచ్చితంగా నిర్ధారించాలి.
తిరిగి అప్పగింత: రుణం పూర్తిగా చెల్లించిన రోజున లేదా గరిష్టంగా 7 పని దినాలలోపు తాకట్టు పెట్టిన వెండిని బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ రుణగ్రహీతకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
పరిహారం: ఆభరణాల తిరిగి అప్పగింతలో ఆలస్యం జరిగితే, గడువు దాటిన ప్రతి రోజుకు రుణగ్రహీతకు రూ. 5,000 చొప్పున పరిహారం చెల్లించవలసి ఉంటుంది.
వేలం ప్రక్రియ: రుణాన్ని తిరిగి చెల్లించని సందర్భంలో వెండిని వేలం వేసే ముందు, బ్యాంకులు తప్పనిసరిగా తగిన నోటీసు ఇవ్వాలి. వేలంలో రిజర్వ్ ధర మార్కెట్ విలువలో కనీసం 90% ఉండాలి. వేలం ద్వారా లోన్ మొత్తం కంటే అదనంగా వచ్చిన డబ్బును 7 పని దినాలలోపు రుణగ్రహీతకు తిరిగి చెల్లించాలి.

ఈ కొత్త నిబంధనలు వెండిపై రుణాలు తీసుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతో ఉపశమనాన్ని, ఆర్థిక సౌలభ్యాన్ని అందించనున్నాయి.

Advertisment
తాజా కథనాలు