Rains : అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

New Update
rains

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి తోడు, దక్షిణ కర్ణాటక నుండి మహారాష్ట్రలోని మరాఠ్వాడా వరకు ఒక ద్రోణి వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం ఏపీ, యానాం మీదుగా వాయువ్య, ఆగ్నేయ దిశల నుండి గాలులు వీస్తున్నాయి. 

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

ఈ క్రమంలో ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు పొగమంచు కూడా కురవచ్చు అని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుంది. అయితే అక్కడక్కడా తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉంది. రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గురు, శుక్ర, శనివారాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుంది. వర్షాలు కురిసే సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు