UAE Rains: దుబాయ్ ను మళ్ళీ భయపెడుతున్న వర్షాలు..పలు నగరాల్లో రెడ్ అలెర్ట్

ఎడారి దేశంలో వర్షాలు పడితే ఆనందించాలి. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మాత్రం వర్షాలు వణుకును పుట్టిస్తున్నాయి. అక్కడ జనజీవనాన్ని స్తంభింపజేస్తున్న వానలు.. మర్చిపోలేని అనుభవాల్ని మిగులుస్తున్నాయి.

New Update
UAE

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్...ఇక్కడ ఉంటే పెద్ద పెద్ద నగరాలతో పాటూ మొత్తం దేశం అంతా ఎడారి మయంగా ఉంటుంది. దుబాయ్ లాంటి చోట్ల సముద్రం ఉన్నా వర్షాలు పడేది మాత్రం తక్కువే. అయితే అరబ్ కంట్రీస్ లో నీటకి మాత్రం ఎటువంటి కొరతా ఉండదు. అందుకే తమదిఏడారి దేశం అయినా నిశ్చింతగా ఉంటారు. ఇలాంటి దేశంలో వానలు పడితే అదొక మంచి విషయం అవుతుంది. ఎప్పుడూ మలమలా మాడిపోయే వారు కాస్త సేద తీరినట్టు అవుతంది. కానీ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడి నగరాల్లో వర్షాలు పడుతున్నాయంటే భయంతో వణికిపోతున్నారు.

Also Read :  దేశం గజగజ వణికిపోవడం గ్యారెంటీ.. ప్లాన్ ప్రకారమే ఉస్మాన్ హదీని కరీం హత్య చేశాడా?

నగరాలను ముంచేస్తున్న వర్షాలు..

ప్రస్తుతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అబుదాబీ, దుబాయ్‌, షార్జా, ఖతార్ సహా అన్ని నగరాల్లో జనజీవనం స్తంభించి పోయింది. రోడ్లు జలమయ్యాయి(floods). విమాన సర్వీసులు ఆగిపోయాయి. ట్రాఫిక్ కు విపరీతంగా అంతరాయం కలిగింది. దాంతో పాటూఅబుదాబీ, దుబాయ్‌లలో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితితో అక్కడి ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది. అందరినీ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. దాంతో పాటూ బీచ్‌లు, పార్కులు, పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేసింది. ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.

Also Read :  బ్లడ్ టెస్ట్ తో డెత్ డేట్ తెలుసుకోవచ్చా.. షాకింగ్ స్టడీ!

వర్షాలంటే ఎందుకంత భయం..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో గత ఏడాది కురిసిన వర్సాలు, దాని కారణంగా సంభవించిన వరదలు ఎంత భీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాలు అయిన దుబాయ్, షార్జా, ఖతార్ లాంటివి కూడా వర్షాలకు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రళయంలా నీరు రోడ్లపై ప్రవహిస్తూ..ఇళ్ళల్లోకి వస్తుంటే ఏం చేయాలో తెలియక అల్లకల్లోమైపోయారు అక్కడి ప్రజలు. మామూలుగా భీభత్సమైన వర్షాలు, ముంచేసే వరదలు ఏ దైశాన్నైనా భయపెడతాయి. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మనకు మామూలుగా పడే పెద్ద వర్షాలు కూడా భయపెడతాయి. దానికి కారణం అక్కడ డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ ఉంటే పెద్ద పెద్ద నగరాలతో పాటూ దాదాపు దేశం మొత్తం డ్రైనేజీ వ్యవస్థ, అండర్‌పాస్‌ నిర్మాణాలు ఉండవు.

ముందే చెప్పినట్టుగా ఇదొక ఎడారి దేశాల సముదాయం. ఇక్కడ వర్షాలు పడడమే చాలా రేర్. ఏళ్ళకు ఏళ్ళు ఒక్క వాన చుక్క కూడా పడని సందర్భాలెన్నో ఉన్నాయి. అందుకే వారు డ్రైనేజ్ సిస్టమ్ గురించి పట్టించుకోలేదు. దానికి తగ్గ నిర్మాణాలు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరగుతుందో చెప్పడం కష్టమైపోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీ ఇదే పరిస్థతి. ఒకప్పుడు వర్షం అంటే ఏంటో తెలియని నగరాలను ఇప్పుడు అవి ముంచి పారేస్తున్నాయి. గతేడాది అయితే దాదాపు 15 రోజుల పాటూ బీభత్సం సృష్టించాయి. ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపిసతోంది. ఇప్పటికిప్పుడు డ్రైనేజ్వ్యవ్థనుమార్చలేరు. కొత్తగా నిర్మించుకోలేరు. అలా అని వర్షాలను ఆపలేరు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎదుర్కుంటోంది. అందుకు వర్షాలు పడితే వణికిపోతోంది. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటోంది. 

Advertisment
తాజా కథనాలు