Melisa Hurricane: మెలిసా హరికేన్ తాండవం..30 మంది మృతి

జమైకా, క్యూబా, హైతీ, బహమాస్ లలో మెలిస్సా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ధాటికి 32 మంది మృతి చెందారు. వరదలు కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. 

New Update
melisa

మెలిసా తుపాను కరేబియన్ దీవులను అతలాకుతలం చేస్తోంది. జమైకా దేశం మొత్తం నీటితో నిండిపోయింది.  ఎక్కడ చూసిన నీరే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెలిస్సా తుపాన్ ప్రస్తుతం కేటగిరీ 5 తుపాన్‌గా మారిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గంటకు 282 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయి. దీని కారణంగా ఇప్పటి వరకు కరేబియన్ దీవుల్లో మొత్తం 32 మంది మరణించారు. హైతీలోని పెటిట్-గోవేలో మెలిస్సాలో కుండపోత వర్షాల కారణంగా నది ఉప్పొంగి ప్రవహించడంతో 25 మంది మరణించారు. నాలుగు దేశాల్లో ప్రజలు హరికేన్ ధాటికి విలవిలలాడుతున్నారు. మరింత మంది మృతి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. వేలాది మంది ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. 

చాలా నష్టం జరిగింది..

మెలిసా హరికేన్ పెద్ద విపత్తు అని జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ అన్నారు. సెయింట్ ఎలిజబెత్ రాజధాని బ్లాక్ రివర్  మొత్తం మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయని తెలిపారు. ట్రెజర్ బీచ్ మరియు బ్లాక్ రివర్ మధ్య 80-90% పైకప్పులు దెబ్బతిన్నాయని లేదా పూర్తిగా చిరిగిపోయాయని హోల్నెస్ చెప్పారు. జమైకాలో ఆసుపత్రి, కోర్టు భవనం, పారిష్ కౌన్సిల్ తో పాటూ అనేక చారిత్రాత్మక భవనాలు వంటి ముఖ్యమైన సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టం పెద్ద ఎత్తున జరిగిందని ప్రధాని ఆండ్రూ తెలిపారు. మరోవైపు క్యూబా, బహమాస్ లలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.  క్యూబాలో 14 వేల మంది వరదల్లో చిక్కుకుపోయారు. 

Advertisment
తాజా కథనాలు