/rtv/media/media_files/2025/10/27/hyderabad-2025-10-27-19-46-23.jpg)
Hyderabad
బంగాళాఖాతంలో మొంథా తుపాను కారణంగా ఏపీకి వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను నేపథ్యంలో కాకినాడ, విశాఖపట్నం మీదుగా వెళ్లే 43 రైళ్లను అధికారులు రద్దు చేశారు. అయితే ఏపీలో తుపాను కారణంగా హైదరాబాద్ వాసులకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే నిత్యం హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగుతుంటాయి. రైళ్లు, బస్సులు, విమానాలు, కార్లు ఇలా ఏదో విధంగా ప్రయాణాలు జరుగుతుంటాయి. దీనికి తోడు కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్, టూర్‌కు వెళ్లే వాళ్లు ఉంటారు. ముఖ్యంగా మంచిలీపట్నం, కాకినాడ, విశాఖ తీరంలో 28వ తేదీన తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అధికారులు ఏపీలోని జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. ఈ సమయంలో హైదరాబాద్ వాసులు కూడా ఏపీకి ప్రయాణించకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.
ఇది కూడా చూడండి: CYCLONE MONTHA: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..దూసుకొస్తున్న ‘మొంథా’ తుపాను
🌪️ CYCLONE MONTHA UPDATE
— Hyderabad Rains (@Hyderabadrains) October 27, 2025
Cyclone Montha is currently around 560 km away from the Machilipatnam & Kakinada coasts and is moving northwards. The system is likely to make landfall by tomorrow evening (28 Oct) along the Andhra coast.
Cyclone Outer band effects will begin from… pic.twitter.com/wKnxsJNdJY
ఇప్పుడు వెళ్లవద్దని..
తుపాను తగ్గిపోయిన తర్వాత ఏవైనా ప్లాన్స్ పెట్టుకోవాలని సూచించారు. అయితే మొంథా తుపాను ప్రభావం కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీలోని ఏ జిల్లాలకు కూడా వెళ్లే ప్లాన్ పెట్టుకోవద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 29వ తేదీ వరకు వర్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Rains: తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో హై అలర్ట్
Follow Us