Cyclone Montha Impact : మొంథా ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు.. ఫుల్ లిస్టు ఇదే!

దక్షిణ మధ్య రైల్వే  కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా..   మరో 14 రైళ్లను దారి మళ్లించింది.  

New Update
railway

తెలంగాణపై కూడా మొంథా తుఫాన్‌ తీవ్ర ప్రభావం పడింది. దీంతో హైదరాబాద్ తో పాటుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా బీభత్సంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే  కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా..   మరో 14 రైళ్లను దారి మళ్లించింది.  ఇందులో ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్‌, గోదావరి, విశాఖ, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు  రద్దు చేశారు. భారీ వర్షాల కారణంగా పలు రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గుండ్రాతిమడుగులో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయాయి. 

షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత 

మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. ఏపీలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్‌ రైళ్లు నిలిచిపోయాయి. రద్దయిన రైళ్లకు సంబంధించిన టికెట్ల రీఫండ్‌ల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితేనే ఈ సమయంలో ప్రయాణించాలని సూచించారు. తుపాను తీరం దాటిన తర్వాత, రైల్వే ట్రాక్‌ల పరిస్థితిని అంచనా వేసి, రద్దు చేసిన రైళ్లను దశలవారీగా పునరుద్ధరించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు