Montha Toofan: మొంథా తుపాను ఎఫెక్ట్.. జలమయమైన పంట పొలాలు.. ఏపీలో ఈ జిల్లాకు రెడ్ అలర్ట్!

మొంథా తుపాను ప్రభావం ఏపీపై భారీగా పడింది. తుపాను వల్ల ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

New Update
MOntha

Montha

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా మారి ఏపీలో బీభత్సం సృష్టించింది. మచిలీపట్నంలో సమీపంలో తుపాను తీరం దాటిన తర్వాత ఏపీలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా భారీ వర్షాలు కురవడంతో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో పాటు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచడంతో అధికారులు అప్రమత్తం చేశారు. పంట పొలాలు అన్ని కూడా నీటితో నిండిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Montha Cyclone: దిశ మార్చుకున్న మొంథా..తెలంగాణను మొత్తేస్తున్న భారీ వర్షాలు

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఏపీ మొత్తానికి తుపాను ప్రభావం ఉన్నా ఎక్కువగా కోనసీమ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, మచిలీపట్నం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు అయితే వేటకు వెళ్లవద్దని సూచించారు. తుపాను నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మరో మూడు రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే విద్యుత్ స్తంభాలు, ఎలక్ట్రిక్ వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు!

Advertisment
తాజా కథనాలు