Weather Update: బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.

New Update
rains

rains

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో  కోనసీమ, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగు ప్రమాదం తప్పదు!

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఇక తెలంగాణలో చూస్తే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రంగారెడ్డి, వరంగల్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Rain Alert : రెయిన్‌ అలెర్ట్‌..మరికొద్ది గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం

Advertisment
తాజా కథనాలు