India-China: షక్స్ గామ్ వ్యాలీ మాదంటే మాదంటున్న భారత్, చైనాలు..ప్రకటనలు
షక్స్ గామ్ వ్యాలీ విషయంలో భారత్, చైనాలు వాదులాడుకుంటున్నాయి. అక్కడ చేపడుతున్న పనుల గురించి భారత్ విమర్శిస్తే..ఆ ప్రాంతం మాదంటూ చైనా ప్రకటనలు చేస్తోంది.
షక్స్ గామ్ వ్యాలీ విషయంలో భారత్, చైనాలు వాదులాడుకుంటున్నాయి. అక్కడ చేపడుతున్న పనుల గురించి భారత్ విమర్శిస్తే..ఆ ప్రాంతం మాదంటూ చైనా ప్రకటనలు చేస్తోంది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ పీఓకే శరణార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ కీలక లేఖ రాశారు. వెనిజులాలో అమెరికా జరిపిన ఆర్మీ ఆపరేషన్లా పీఓకేకు విముక్తి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్మూకశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. POKతో పాటు జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జేష్-ఏ-మహమ్మద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొత్తగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనవరి 1 నుండి 7 రోజుల పాటు ఈ క్యాంప్ నిర్వహించాలని ప్రణాళికలు వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ ఆదివారం మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. PoK లో ప్రజలు తిరగబడటం, ఉద్రిక్తతల నేపథ్యంలో మోహన్ భగవత్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
PoKలో గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి 12 మందిని బలితీసుకున్నాయి. పాక్ ఆక్రమించిన ప్రాంతం కాబట్టి అక్కడ ప్రజలపై సవితి తల్లిప్రేమ ఒలగబోస్తోంది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఆందోళనల్లో నిరసనకారులు పాక్ ఆర్మీని తీవ్రంగా అవమానిస్తూ ఒక చర్యకు పాల్పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.