Jaish-E-Mohammed: జేష్-ఏ-మహమ్మద్ భారీ కుట్ర.. PoKలో ట్రైనింగ్ క్యాంప్

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జేష్-ఏ-మహమ్మద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొత్తగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనవరి 1 నుండి 7 రోజుల పాటు ఈ క్యాంప్ నిర్వహించాలని ప్రణాళికలు వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

New Update
Jaish-e-Mohammed active again in Pakistan

Jaish-e-Mohammed active again in Pakistan

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జేష్-ఏ-మహమ్మద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొత్తగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనవరి 1 నుండి ఏడు రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ సంస్థ ప్రణాళికలు వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత్‌లో అస్థిరతను సృష్టించడమే లక్ష్యంగా జేష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. జనవరి 1, 2026 నుండి వారం రోజుల పాటు PoKలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Also Read :  2025లో చోటుచేసుకున్న ఆసక్తికర రాజకీయ పరిణామాలు ఇవే ..

Jaish E Mohammed Terror Camps

కొత్తగా రిక్రూట్ అయిన ఉగ్రవాదులకు ఆయుధాల వినియోగం, గెరిల్లా పోరాట పద్ధతులు, సరిహద్దుల గుండా చొరబాటుపై శిక్షణ ఇవ్వడం. ఈ శిబిరం జేష్-ఏ-మహమ్మద్ అగ్రశ్రేణి కమాండర్ల పర్యవేక్షణలో జరగనుందని, వీరికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ(pakistan terror camps) ISI పరోక్ష సహకారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత సరిహద్దులకు సమీపంలో ఉన్న లాంచ్ ప్యాడ్ల వద్ద ఈ శిక్షణను ప్లాన్ చేశారు. తద్వారా శిక్షణ ముగియగానే మంచు కురిసే సమయంలో భారత్‌లోకి చొరబడటం సులభమవుతుందని వారి ఎత్తుగడ. ఈ వార్తల నేపథ్యంలో BSF,  సైన్యం నియంత్రణ రేఖ వెంట గస్తీని మరింత ముమ్మరం చేశాయి. సరిహద్దుల్లో అనుమానాస్పద కదలికలను కనిపెట్టడానికి అధునాతన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

గతంలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' వంటి మెరుపు దాడులతో ఉగ్రవాద స్థావరాలు దెబ్బతిన్నప్పటికీ, ఉగ్రవాదులు తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. గత ఏడాది పహల్గామ్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత, భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబిస్తోంది. జేష్-ఏ-మహమ్మద్ వంటి సంస్థలు PoK నుండి తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయని భారత్ అంతర్జాతీయ వేదికలపై నిరంతరం గళమెత్తుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర శిబిరాల పునరుద్ధరణ ప్రయత్నాలు దక్షిణాసియాలో శాంతికి విఘాతం కలిగించే అంశంగా మారాయి. భారత సైన్యం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంది.

Also Read :  పాకిస్థాన్‌కు ఇక చుక్కలే.. మరో దాడికి సిద్ధమవుతున్న భారత్

Advertisment
తాజా కథనాలు