/rtv/media/media_files/2026/02/07/trade-2026-02-07-11-31-16.jpg)
In India-US Trade Framework, Washington's Kashmir Message To Pakistan
ఎన్నోఏళ్ల తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. భారత్-అమెరికా మధ్య కొత్తగా వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన భారతదేశ అధికారిక మ్యాప్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
గతంలో అమెరికా విడుదల చేసే మ్యాప్‌లలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తూ, 'లైన్ ఆఫ్ కంట్రోల్' (LoC) వద్ద చుక్కల గీతలు పెట్టేవారు.
Also Read: భారత్ - అమెరికా కీలక ప్రకటన.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు
కానీ, తాజా మ్యాప్‌లో పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో ఎలాంటి సరిహద్దు రేఖలు లేకుండా పూర్తిగా భారతదేశంలో భాగంగా చూపించారు. చైనా ఆధీనంలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా భారత భూభాగంలోనే కలిపి చూపారు. భారతదేశం అధికారికంగా ప్రకటించిన భౌగోళిక సరిహద్దులనే అమెరికా తమ మ్యాప్‌లో ధృవీకరించింది.
From tree nuts and dried distillers’ grains to red sorghum and fresh and processed fruit, the U.S.-India Agreement will provide new market access for American products. pic.twitter.com/mqpP10LJp1
— United States Trade Representative (@USTradeRep) February 6, 2026
ఎందుకు ఈ మార్పు?
ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఇది గట్టి సంకేతమని చెబుతున్నారు. పీఓకేపై పాక్ వాదనను అమెరికా పరిగణనలోకి తీసుకోవడం లేదనే విషయం స్పష్టం అయినట్లు పేర్కొంటున్నారు. మరోవైపు అక్సాయ్ చిన్ విషయంలో కూడా అమెరికా భారత్ వైఖరిని సమర్థించి.. చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
Also Read: దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల స్ట్రైక్.. డిమాండ్స్ ఇవే !
భారత్‌పై టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించిన తర్వాత.. ఇండియాను ఒక శక్తివంతమైన మిత్రదేశంగా గుర్తించడంలో భాగంగానే ఈ మ్యాప్ విడుదలయినట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ కూడా అమెరికా విడుదల చేసిన మ్యాప్‌ను స్వాగతించింది. కశ్మీర్ అనేది భారతదేశంలో విడదీయలేని భాగమని తాము ఎప్పటి నుంచో చెబుతున్న విషయాన్ని అమెరికా ఇప్పుడు గుర్తించిందని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాప్ వైరల్ అవుతోంది. అయితే ఈ కీలక పరిణామం దక్షిణ ఆసియా రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే ఛాన్స్ ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై కశ్మీర్ అంశంలో భారత్ వాదన మరింత బలపడనుంది.
Follow Us