POK: పీఓకేలో అల్లర్లు.. భారత్‌ సంచలన ప్రకటన

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌(POK)లో గత కొన్నిరోజులుగా అల్లర్లు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమాయక ప్రజలపై పాక్ బలగాల అరాచకత్వం వల్ల ఈ హింసాత్మక ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
POK

POK

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌(POK)లో గత కొన్నిరోజులుగా అల్లర్లు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమాయక ప్రజలపై పాక్ బలగాల అరాచకత్వం వల్ల ఈ హింసాత్మక ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యవహారంపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. పాకిస్థాన్ అణిచివేత విధానం వల్లే అశాంతి పరిస్థితులకు దారితీశాయని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. '' పీఓకేలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లు, పాక్ బలగాల అరాచకత్వం గురించి మాకు తెలిసింది. పీవోకేలో మానవహక్కుల ఉల్లంఘన జరిగింది. ఈ విషయంలో పాక్‌ను జవాబుదారీతనంగా చేయాలని'' పేర్కొంది. 

Also Read: పవన్‌ కళ్యాణ్, రిషబ్‌ షెట్టికి షాక్.. ఆ దేశంలో సౌత్ ఇండియన్ సినిమాలు నిలిపివేత

POK Unrest Result Of Pakistan's Oppressive Approach India

పాకిస్థాన్ అణిచివేత ధోరణిని పాటించడంతో పాటు ఆ ప్రాంతంలో వనరులను కొల్లగొట్టడమే ఈ అశాంతికి కారణమని మేము భావిస్తున్నామని తెలిపింది. మరోవైపు ఈ అల్లర్లకు భారత్‌ కారణంటూ పాకిస్థాన్ వ్యాఖ్యానించింది. అంతేకాదు శత్రు దేశమమైన భారత్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిరసనలు చేయొద్దని పాక్ మంత్రి అహ్సన్ ఇక్బాల్‌ పీఓకే ప్రజలను కోరారు.  

మరోవైపు POK తమ దేశంలో భాగమమని భారత్ ఎప్పటినుంచో చెబుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. '' భారత్‌కు కశ్మీర్‌ విషయంలో ఓ క్లారిటీ ఉంది. ఇప్పుడు పాక్‌కు పీఓకేను అప్పగించడం తప్ప మరో మార్గం లేదు. ఉగ్రవాదుల అప్పగింత గురించి వాళ్లు మాట్లాడితే మేము కూడా మాట్లాడుతాం. ఇందులో మేము ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరడం లేదు. దీనికి ఎవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం కూడా లేదని'' భారత్‌ స్పష్టం చేసింది.  

Also Read: వెళ్ళిపోండి..లేకుంటే తీవ్రవాదులుగా పరిగణన..గాజా ప్రజలకు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక

ఇదిలాఉండగా పీఓకేలో సెప్టెంబర్ 26 నుంచి అవామీ యాక్షన్ కమిటీ (AAC) నేతృత్వంలో ఆందోళనలు జరుగుతున్నాయి. పాక్‌ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్లకు పైగా పీవోకేలో తమకు ఎలాంటి ప్రాథమిక హక్కులు లభించలేవని వాపోతున్నారు. ఈ క్రమంలోనే పీవోకేలో సంస్కరణలు తీసుకురాలంటూ నిరసనలకు దిగారు. తమ 38 డిమాండ్లు నెరవేర్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనలు తీవ్రతరం కావడంతో పాక్‌ ప్రభుత్వం బలగాలను రంగంలోకి దింపింది. ఈ ఘర్షణలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది గాయాలపాలయ్యారు. 

Advertisment
తాజా కథనాలు